»Telugu Boy Sai Varshith Charged With Attempt To Kill Us President Biden
Sai Varshit : వీలైతే బైడెన్‌ను చంపాలని అలా చేశానన్న తెలుగు కుర్రాడు!
అమెరికాలో వైట్ హౌస్ దగ్గర గతేడాది ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సాయి వర్షిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వీలైతే బైడెన్‌ను చంపాలనే అలా చేశానని ఈ తెలుగు కుర్రాడు చెప్పాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telugu Boy Sai Varshith : తెలుగు కుర్రాడు కందుల సాయి వర్షిత్(20)(Sai Varshith) తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కుదిరితే బైడెన్‌ను చంపాలనుకున్నానని అందుకనే ట్రక్కుతో బీభత్సం సృష్టించానని చెప్పుకొచ్చాడు. 2023 మేనెల 22వ తేదీన సాయి వర్షిత్ ఒక ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. దానితో వేగంగా వెళ్లి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ దగ్గర బీభత్సం సృష్టించాడు.
దీంతో ఈ సంఘటనలో అమెరికా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కోర్డు విచారణలో భాగంగా అతడిని ప్రశ్నించగా ‘వీలైతే బైడెన్‌ని(Biden) చంపాలనుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. వైట్ హౌస్ భవనంలోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తాను ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాడు. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను ఇతరులతోపాటు అవకాశం వస్తే బైడెన్నీ చంపాలని అనుకున్నట్లు వెల్లడించాడు.
దీంతో నిందితుడు ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం చేకూర్చాడని కోర్టు నిర్ణయానికి వచ్చింది.
ఈ విషయమై అటార్నీ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) ప్రభుత్వాన్ని దించేసి.. నాజీ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో యువకుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తేల్చింది. అతడు నాజీ సిద్ధాంతాలకు బాగా ప్రభావితం అయి ఇలాంటి పని చేశాడని పేర్కొంది.