Telangana: రెండు వారాల పాటు సినిమా థియేటర్లు బంద్!
మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ చేయనున్నారు. స్టార్ హీరో సినిమాలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
Telangana: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. రెండు వారాల పాటు సినిమా థియేటర్లు బంద్. గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్లో పెద్ద సినిమాలు లేవు. అలాగే ఒక పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో స్టార్ హీరో సినిమాలు వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరో సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు థియేటర్‌కు రావడం తగ్గించారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయి. అయితే ఈ నష్టాలు రాకుండా ఉండటానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఒక నిర్ణయానికి వచ్చాయి. వేసవి అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయడం వల్ల ఈ వారం వచ్చే చిన్న సినిమాలు నష్టపోనున్నాయి. వీటివల్ల సినిమాలకు భారీ ఎఫెక్ట్ పడుతుంది.