ఉక్రెయిన్ పై అమెరికా రిపబ్లికన్ (Republican) అభ్యర్థిత్వ పోటీదారు వివేక్ రామస్వామి కామెంట్స్ నేపధ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ (Ukraine) మద్దతుదారులు నిరసన తెలిపారు. రామస్వామి వైఖరిని నిరసిస్తూ కొందరు దాడికి ప్రయత్నించారు.కొందరు నిరసనకారులు తన కాన్వాయ్‌లోని వాహనంపై దాడి చేశారని వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఆరోపించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉక్రెయిన్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు.
అయోవాలోని గ్రిన్నెల్(Grinnell)లో ఈ ఘటన జరిగింది. అయితే, వివేక్ రామస్వామి ఆరోపణలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు (Police) వెల్లడించారు.మరో వైపు ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని,తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని వివేక్ చెప్పారు. ఇద్దరు నీలి రంగు హోండా సివిక్ కారుతో నా కాన్వాయ్(Convoy)లోని ఎస్‌యూవీని ఢీ కొట్టారు.
అనంతరం మా సిబ్బందికి అసభ్య సంజ్ఞలు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కారుతో ఢీ కొట్టిన వాళ్లు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని వివేక్ రామస్వామి ట్వీట్ (Tweet)చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు తెలిపే హక్కు ఉంటుందని, అందుకు ఇది సరైన విధానం కాదని మరో ట్వీట్లో తెలిపారు. ప్రస్తుతం వివేక్ రామస్వామి నిరసనకారులతో మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Had a civil exchange with protestors today, right before two of them then got into their car & rammed it into ours. Those two should be held accountable, but the rest of the peaceful protestors shouldn’t be tarred by the behavior of two bad actors. https://t.co/AePWupLDEj