Congress-BJP: రావణాసురుడిగా రాహుల్ గాంధీ.. బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్..!
రాహుల్ గాంధీని రావాణాసురుడిలా పోల్చుతూ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేయగా.. దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ పోస్టర్ విడుదల చేసింది. ప్రధాని మోడీ అదానీ చేతిలో కీలుబొమ్మగా ఆ ఫోటోలో ఉంది.
To BJP’s Rahul Gandhi as ‘Ravan’ poster, Congress’s ‘Adani puppet’ barb
Congress-BJP: ఒకరిపై మరొకరు విమర్శలు చేయడం రాజకీయాల్లో చాలా కామన్. ఎన్నికల సమయం వచ్చేసరికి విమర్శలు మరింత వేడెక్కుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రావణాసురుడి అవతారంలో చూపించారు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
రావణాసురుడి అవతారంలో ఉన్న ఫోటోకు రాహుల్ గాంధీ తల ఉండేలా ఎడిటింగ్ చేసిన ఫోటోను బీజేపీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్ కూడా జోడించింది. రాహుల్ గాంధీని నవయుగ రావణుడిగా అభివర్ణిస్తూ పోస్టర్ విడుదల చేసింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఫోటో రిలీజ్ చేసింది.
బీజేపీ పోస్టర్‌కు రావణ్ అని టైటిల్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్లో పేర్కొంది. ఈ పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. బీజేపీ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరిస్తూ గ్రాఫిక్ ఫోటోలు విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ పోస్టర్ విడుదల చేసింది. ప్రధాని మోదీని ఓ పప్పెట్ లా చూపించారు. ఆయనను తోలు బొమ్మలాగా అదానీ ఆడిస్తున్నారనే అర్థం వచ్చేలా పోస్టర్ విడుదల చేసి, బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. వీరి కౌంటర్, రీ కౌంటర్లతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.