ఎన్నికల వేళ ఉచిత హామీలు ఇవ్వడంతో 2 రాష్ట్రలకు సుప్రీం కోర్టు (Supreme Court) నోటిసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్,రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రలు తమ వైపు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత ప్రకటనలు చేస్తున్నాయని పిల్లో ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఓటర్లకు డబ్బును పంపిణీ చేయడం దారుణమని, ఎన్నికల వేళ ప్రతిసారి ఇదే జరుగుతోందని, పన్నుదారులపై ఆ భారం పడుతుందని పిల్ తరపున న్యాయవాది వాదించారు. ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ భట్టూలాల్ (Bhattulal) జైన్ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. పన్నుదారుల డబ్బుతో ఓటర్లకు ఉచితాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా(Pardiwala), జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ (RBI)కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. మళ్లీ నాలుగు వారాల్లో ఈ కేసుపై విచారణ చేపట్టనున్నారు.కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Tusshar Mehta) వాదనలు వినిపిస్తూ రాజకీయ పార్టీల ఉచిత హామీలు ఆర్థిక విధ్వంసానికి దారి తీస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఉచిత హామీలపై ఇటీవలే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది.