Chandrababu is the only one in the quota and the only one in the Peta
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani). తప్పు చేసినందునే చంద్రబాబు జైలుకు వెళ్లారని వివరించారు. బాబు కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. ఇటీవల వైసీపీపై పవన్ కల్యాణ్ రూపాయి పావలా అని విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై కూడా స్పందించారు. తమకు 125 సీట్లు వస్తాయని పవన్ కల్యాణ్ ఉద్దేశం అని చెప్పారు. పవన్‌కు మాత్రం 25 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు దొరికన దొంగ అని విమర్శించారు. స్కామ్ ఎలా బయటపడిందో వివరించారు. స్కామ్ లింక్ మహారాష్ట్రలో బయటపడిందని వివరించారు. విచారించగా.. విచారించగా బాబు పేరు వచ్చిందన్నారు. ఏ1, ఏ2 ఇలా 37వ నిందితుడిగా చంద్రబాబు ఉన్నారని పేర్కొన్నారు. 2017లో కేసు నమోదై.. విచారణ కొనసాగుతోందని తెలిపారు.
తప్పు జరిగింది కాబట్టే బెయిల్ రావడం లేదన్నారు. సీఐడీ కోర్టులో ఏం వాదనలు జరిగాయి.. హైకోర్టులో ఏం విచారణ జరిగింది.. అనే అంశాలు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు లాయర్లు ఏం వాదించారు.. సీఐడీ తరఫు వకీల్ ఏం వివరించారనే అంశాలను లోతుగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆ నాడు కాపు నేత ముద్రగడ పద్మనాభం పల్లెం కొట్టమని చెబితే.. అతని భార్య, కొడుకును ఈడ్చుకెళ్లారని గుర్తుచేశారు. తాము అలా చేయడం లేదన్నారు. 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు కొట్టుకోవాలని కోరారు. రోజు రాత్రి కొవ్వొత్తి పట్టుకొని తిరగమనాలని సూచించారు.
పవన్ ఎన్డీఏలో ఉన్నాడో లేడో తమకేం తెలుసు అని కొడాలి నాన్ని అన్నారు. అతను ఇండియాలో ఉంటే చాలని సెటైర్లు వేశారు. ఒడిశాలో బిజు పట్నాయక్ వద్ద ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి.. ఓడిపోయారని గుర్తుచేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకేలా ఉంటుందన్నారు. అరిచె కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదన్నారు.