త కొన్ని రోజుల నుంచి ఎర్ర సముద్రంలో హూతీలు దాడులు చేస్తున్నారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై నిన్న హూతీలు దాడులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ఈ విషయాన్ని తెలిపారు.
ఓ మహిళలకు విమానంలో పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులతో బాధపడుతున్న ఆమెకు పైలట్ విజయవంతంగా డెలివరీ చేశాడు.
కొలరాడోలో జరిగే రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది డొనాల్డ్ ట్రంప్‌పై అనర్హత వేసింది. దీన్ని ఇప్పుడు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేస్తూ తీర్పిచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
భారత్, మాల్దీవుల మధ్య వివాదం తెలిసిందే. అయితే ఈక్రమంలో మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు చైనా ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది.
తన ప్రియుడి కోసం భారత సరిహద్దుల్ని అక్రమంగా దాటి వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌కు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమె భర్త ఆమెపై 3 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపించారు.
సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్‌మెరేన్లను తమ నేవల్ బేస్‌లో మోహరించేందుకు అనుమతిచ్చింది.
ప్రతి ఏడాది చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై మరో దావా దాఖలైంది. ఆయన ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత అందులో తొలగించిన ఉద్యోగులకి అందాల్సిన 128 డాలర్ల సెవెరెన్స్ చెల్లింపులు చేయలేదని ఆయనపై కేసు నమోదైంది.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీలు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగా నిక్కీ హేలీకి తాజాగా తొలి గెలుపు దక్కింది.
పాకిస్థాన్‌లో చాలా రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ మధ్య ఎట్టకేలకు కొత్త ప్రధానిని ప్రకటించారు. పాకిస్థాన్ తదుపరి ప్రధానిగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.
బంగ్లాదేశ్ రాజధాని ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఒక దేశంలో ఓ మహిళ సగం బిడ్డకు జన్మనిస్తుంది. ఏంటి సగం బిడ్డకా.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజం. దీనికి దక్షిణ కొరియా సాక్షిగా ఉంది. ఈ దేశం సంతానోత్పత్తి రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కార్చిచ్చు అలుముకుపోయింది. పెద్ద ఎత్తున చెట్లను అటవీ భుములను భస్మం చేస్తోంది.
సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్ భారతీయులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దుబాయ్‌ని సందర్శించే భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండంతో ప్రత్యేక వీసా ఆఫార్‌ను జారీ చేసింది.