»Maldives China China Offers Free Military Aid To Maldives
Maldives-China: మాల్దీవులకు చైనా ఉచిత సైనిక సాయం
భారత్, మాల్దీవుల మధ్య వివాదం తెలిసిందే. అయితే ఈక్రమంలో మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు చైనా ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది.
Maldives-China: భారత్, మాల్దీవుల మధ్య వివాదం తెలిసిందే. అయితే ఈక్రమంలో మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు చైనా ఇంకా ప్రయత్నాలు చేస్తోంది. మాల్దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు డ్రాగన్ ముందుకొచ్చింది. దీనిపై ఇరు దేశాలు తాజాగా ఒప్పందం చేసుకున్నాయి. తమ దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు డెడ్లైన్ విధించిన కొన్ని వారాలకే ఈ ఒప్పందం జరిగింది. మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘాసన్తో చైనా మేజర్ జనరల్ జాంగ్ బావోకున్ నిన్న మాలెలో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే అంశంపై చర్చలు జరిపారు. తర్వాత మాల్దీవులకు సైనిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండు దేశాలు ఈ ఒప్పందం వివరాలను బయటకు వెల్లడించలేదు. అయితే ఈ సైనిక సహకారాన్ని డ్రాగన్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్ మయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మాల్దీవులు, భారత్ మధ్య దూరం పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి ఉపసంహరించుకోవాలని డెడ్లైన్ విధించారు. ఈ క్రమంలోనే సైనిక దళాలను వెనక్కి పిలిపిస్తున్న భారత్ వాళ్ల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని ఆ దీవుల్లో భర్తీ చేయనుంది.