»Seema Haiders First Husband From Pakistan Sends Her Partner Sachin Rs 3 Crore Notice
seema haider : పాక్ నుంచి ప్రియుడి కోసం భారత్‌కు వచ్చిన సీమాకు పరువు నష్టం నోటీసు
తన ప్రియుడి కోసం భారత సరిహద్దుల్ని అక్రమంగా దాటి వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌కు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమె భర్త ఆమెపై 3 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపించారు.
Seema Haider : పాకిస్థాన్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి ప్రియుడి కోసం భారత్ చేరుకున్న సీమా హైదర్‌కు ఆమె పాకిస్థానీ భర్త నుంచి నోటీసులు అందాయి. సీమా హైదర్, ప్రియుడు సచిన్‌లకు రూ. మూడు కోట్ల పరువు నష్టం నోటీసులు అందాయి. అలాగే సీమా తరఫు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు రూ. 5 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపారు. వీరు ముగ్గురు నెల రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని, అలాగే జరిమానా కట్టకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
పాకిస్థాన్‌కి(Pakistan) చెందిన సీమా హైదర్(Seema Haider) భర్త గులాం హైదర్ ఈ మధ్య హర్యానాలోని పానిపట్‌కి చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ని తన న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలన్నింటిలోనూ భర్తగా గులాం హైదర్ పేరు రాసి ఉందన్నారు. కోర్టు నుంచి ఆమె బెయిల్ పొందేప్పుడు కూడా ఆమె భర్తగా హైదర్ పేరే రాసి ఉందన్నారు. ఈ విధంగా తాను గులాం హైదర్ భార్యని అని తప్పుగా చెబుతోందని అన్నారు.
అలాగే గులాం హైదర్ పంపించిన నోటీసులో తాను సీమా హైదర్ నుంచి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేని పేర్కొన్నారు. ఇప్పుడు సచిన్‌తో ఉంటున్న ఆమె తన పేరును భర్త పేరుగా వాడుకోవడం సబబు కాదని అందుకనే వారికి పరువు నష్టం నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు.