Australia Visa: ప్రతి ఏడాది చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు ఆస్ట్రేలియాకు వెళ్తుంటారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా యూనివర్సిటీలు విద్యార్థులు ఆడ్మిషన్ల ఆఫర్లను ఉపసంహరించుకున్నారు. ఈ కారణంగా వీసాల తిరస్కరణ పెరిగింది. దరఖాస్తు సరిగ్గా లేదన్న కారణంతో యూనివర్సిటీ ఆఫ్ వొలోంగాంగ్, లా ట్రోబ్ యూనివర్సిటీలు పలు విద్యార్థులకు ఆఫర్లను ఉపసంహరించాయని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపింది.
భారతీయ విద్యార్థుల దరఖాస్తులను తాము తిరస్కరించడం లేదని ఆస్ట్రేలియా యూనివర్సిటీలు చెబుతున్నాయి. ఇటీవలి స్టడీ వీసా దరఖాస్తుల విషయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని విదేశీ విద్యా నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాలో మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 3,75,000కు తగ్గుతుందని, తర్వాతి ఏడాదికి రెండున్నర లక్షలకు పడిపోతున్నాయట. అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చాలా దరఖాస్తులను తిరస్కరించారని, ఇది ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా రావాలనుకొంటున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.