అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్ భారతీయులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దుబాయ్‌ని సందర్శించే భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండంతో ప్రత్యేక వీసా ఆఫార్ను జారీ చేసింది.
Dubai: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్ భారతీయులకు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దుబాయ్‌ని సందర్శించే భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండంతో ప్రత్యేక వీసా ఆఫార్ను జారీ చేసింది. ఇది ఐదు సంవత్సరాల బహుళ వీసా ఆఫర్. ఈ ఆఫర్‌తో భారతీయులు సెలవులు గడపడంతో పాటు అక్కడ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. కొత్త వీసా ఆఫర్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న రెండు నుంచి ఐదు పనిదినాల్లో వీసా జారీ చేస్తారని దుబాయ్ టూరిజం తెలిపింది. దీని తర్వాత ఏ పర్యాటకుడైనా ఒకసారి వెళ్తే 90 రోజుల పాటు దుబాయ్‌లో ఉండి రావచ్చు.
ఇలా ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకూడదు. అయితే వీసాకు అర్హులైన వాళ్లు కచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలి. గత ఆరునెలల్లో బ్యాంక్ ఖాతాలో 4000 డాలర్ల లేదా అంతకు సమానమైన విదేశీమారకద్రవ్యం ఉండాలి. యూఏఈలో చెల్లుబాటయ్యేలా ఆరోగ్య బీమా తప్పనిసరి. రెండు దేశాల మధ్య ఆర్ధిక సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటకం, వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడానికి దుబాయ్ ఈ ప్రత్యేక వీసాని ప్రకటించింది. గతేడాది దుబాయ్‌కి భారతదేశం నుంచి 2.46 మిలియన్ల మంది వెళ్లారు. ఈ సంఖ్య కోవిడ్ ముందు కంటే 25 శాతం ఎక్కువ.