Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి కొంతమందిని రక్షించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి సమంతా లాల్ సేన్ మాట్లాడారు. గాయపడిన వాళ్లను చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ల విక్రయ కేంద్రాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కొందరు నీటి పైపుల ద్వారా కిందకు దిగారని తెలిపారు.