మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామానికి చెందిన టి. మహేశ్వరి అనే మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు ఎక్కువకావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారంను అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది మహిళ ఇంటికి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ కావడంతో సిబ్బంది ప్రసవం చేయగా ఇద్దరు కవలలు జన్మించారు.