AKP: నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిసాయి. సుదర్శన పెరుమాళ్ ను పల్లకిలో ఊరేగించి బలి విసర్జనలు పూర్తి చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించారు. ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించారు. చక్రవారి స్నానం, విజయదశమి సెమీ పూజ నిర్వహించారు.