SDPT: విజయదశమి పండగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని కోటిలింగేశ్వర ఆలయంలో నిర్వహించిన జమ్మి పూజలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు మరింత విజయాలు సాధించాలని, అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.