WG: బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతి ఒక్కరూ నిరంతరం పాటుపడాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో బాపూజీ విగ్రహానికి జేసీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.