VZM: స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డ్స్ ఎంపికలో విజయనగరం జిల్లా రెండు రాష్ట్ర స్థాయి అవార్డులు, 48 జిల్లా స్థాయి అవార్డులు పొందిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు విభాగంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎంపికైందన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీల విభాగంలో (50 వేల నుండి లక్ష జనాభా) బొబ్బిలి మున్సిపాలిటీ ఎంపికైందన్నారు.