కోనసీమ: మండపేట టౌన్ పరిధిలో రావులపేటలో పెంకిటింటిలో ఎటువంటి లైసెన్సు అనుమతి లేకుండా దీపావళి బాణ సంచా తయారు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మండపేట టౌన్ పోలీస్లు గురువారం దాడులు చేశారు. సుమారు రూ.5 లక్షల విలువ గల మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు. తయారీ దారుడును అరెస్ట్ చేసినారు. దీనిపై మండపేట టౌన్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.