SDPT: విజయదశమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ గిద్దె పరుమాండ్ల స్వామివారిని గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శమీ పూజలో కూడా పాల్గొని ప్రత్యేక పూజలతో పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.