NRML: నిర్మల్ పట్టణంలో నిర్వహించిన దసరా ఉత్సవాలలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా సెమీ వృక్షానికి పూజలు చేసి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ దసరా పర్వదినాన విజయాలు చేకూరాలని ఈ సందర్భంగా వారు కోరారు.