కోనసీమ: విజయ దశమి మహపర్వదినం పురస్కరించుకుని మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి జమ్మి వృక్షానికి శమి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని అమ్మవారిని జమ్మి వృక్షం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. శమి శ్లోకంతో ప్రదక్షిణ జరిపారు, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.