TG: రియల్ ఎస్టేట్ పడిపోవడంతో పాటు వ్యాపారం లేక తెలంగాణ దివాలా తీసిందని BRS నేత హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన రావణ దహనంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. దసరా అంటేనే చెడుపై సాధించిన విజయం అని.. అందుకే తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.