SRPT: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే సామేలు అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆర్డీఆర్ నివాసంలో వారి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు గెలిచి ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.