AP: విజయవాడలో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా నిలిచింది. దీనికి సంబంధించిన ప్రశంసాపత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు దసరా కార్నివాల్ వాక్ చేపట్టగా.. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.