SDPT: గజ్వేల్ పట్టణంలోని పురాతన శ్రీ మహాంకాళీ దేవాలయంలో విజయదశమి సందర్భంగా అమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు భక్తులకు అపరాజిత దేవిగా దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అమ్మ వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు.