ATP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలో ఈనెల 6న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీలో తాడిపత్రి తొలి స్థానంలో నిలవడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ అవార్డు అందుకోనున్నారు. కాగా, క్లీన్ అండ్ గ్రీన్, అండర్ డ్రైనేజీ, పక్కా చెత్త సేకరణ తదితర కారణాలతో తాడిపత్రికి అవార్డు దక్కింది.