CTR: విజయదశమి పురస్కరించుకొని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. మొదట బీవీ రెడ్డి కాలనీలోని గృహంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వాహనాలకు పూజలు నిర్వహించి నగరంలో తిప్పారు. కార్యక్రమంలో మేయర్ ఎస్.అముద పాల్గొన్నారు.