W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో గురువారం ఉచిత మధుమేహం రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. 110 మందికి మధుమేహ రక్త పరీక్షలు చేశారు. జనతా డాక్టర్ ఎల్ఎస్వీ నాగేశ్వరావు మాట్లాడుతూ.. షుగర్‌ను తొలి దశలోనే గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా షుగర్ వల్ల వచ్చే సమస్యలను అదుపు చేయవచ్చన్నారు. ఇందులో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చిన్నం మణీంద్ర, త్రిమూర్తులు పాల్గొన్నారు.