HYD నగర వేదికగా నవంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు హైటెక్స్ వద్ద పౌల్ట్రీ ఇండియా 17వ ఎడిషన్ ఎక్స్ పో జరగనున్నట్లు కార్యనిర్వాహకులు తెలియజేశారు. వివిధ దేశాల మంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనన్నున్నారు. ఈ ఏడాది 50 వేలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. 16 ఏళ్లుగా హైదరాబాద్ వేదికగా పౌల్ట్రీ ఎక్స్ పో జరుగుతుంది.