W.G: స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో 1 రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు. దేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ వివరాలను సాసా (SASA) పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.