సత్యసాయి: తాడిమర్రిలో గురువారం రాత్రి గ్రామ సభ నిర్వహించారు. రౌడీషీటర్లు నేరప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో నడుచుకోవాలని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ సూచించారు. సైబర్ క్రైమ్, భూతగాదాలు, మహిళలు చిన్నారులపై నేరాలపై అవగాహన కల్పించారు. రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.