ప్రకాశం: విజయదశమి పండుగను పురస్కరించుకొని కంభంలో సత్యమాంబ దేవి ఊరేగింపు కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కోలాటం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.