అన్నమయ్య: గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ మదనపల్లె పట్టణంలోని తాహసీల్దార్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. నేటి యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని కోరారు. దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.