అన్నమయ్య: మదనపల్లెకు చెందిన ఏపీ ఎండీసీ మాజీ ఛైర్మన్ షమీమ్ అస్లాంకు వైసీపీ పార్టీలో కీలక పదవి లభించింది. ఈ మేరకు ఇవాళ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆమెను స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇంఛార్జి నిస్సార్ అహ్మద్, మున్సిపాల్ చైర్ పర్సన్ మనోజా రెడ్డి తదితరులు ఆమెను ఘనంగా సన్మానించారు.