W.G: ఉండి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ సమీకృత వ్యవసాయ పరీక్షా కేంద్రం (ల్యాబ్)ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.