KDP: ప్రతి ఒక క్రీడాకారుడిలో క్రీడా స్ఫూర్తి ఉండాలని బద్వేల్ అర్బన్ సీఐ లింగప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం దసరా పండగ పురస్కరించుకొని DYFI ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ పాల్గొన్నారు.