మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద MLC తక్కలపల్లి రవీందర్ రావు, గురువారం పూజలు నిర్వహించారు. తన కుమారులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నేడు విజయదశమి సందర్బంగా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు.