MNCL: జన్నారం మండలంలో ప్రజలు జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. దసరా సందర్భంగా జన్నారం శివారులోని జమ్మి గద్దె వద్దకు గురువారం సాయంత్రం ప్రజలు భారీగా చేరుకున్నారు. అక్కడి జమ్మి చెట్టుకున్న ఆకులను తీసుకొని ఇతరులకు ఇస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని తపాలాపూర్, తిమ్మాపూర్, చింతగూడా, చింతలపల్లి అన్ని గ్రామాలలో జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించారు.