KRNL: ఆదోనిలో అక్రమ కట్టడాల నిర్మాణం అడ్డుకట్ట విషయంలో అధికారులకు ప్రజలు సహకరించాలని ఆదోని MLA పార్థసారధి అన్నారు. గురువారం పట్టణంలోని పలు కాలనీలను ఆయన సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆదోని పట్టణం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఏ కాలనీలో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఆ కాలనీవారికే నష్టమన్నారు. ఆదోని పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు.