JN: పాలకుర్తిలో నల్ల నరసింహులు 99వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతన సాహిత్య కళావేదిక ప్రతినిధులు వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కళావేదిక అధ్యక్షుడు మన్యపు బుజెందర్ మాట్లాడుతూ.. నల్ల నరసింహులు రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి దొరలను, నైజాములను గడగడలాడించిన వీరయోధుడు అని అన్నారు.