భారత్ అతిథ్యం ఇచ్చిన ప్రపంచ అందాల పోటీలో మిస్ వరల్డ్-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. టాప్-8వ స్థానంలో భారత యువతి సినీ శెట్టి ఉంది.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. ఆసిఫ్ అలీ జర్దారీ విజయంతో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఓటు వేశారు.
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాదిలో వివాహం చేసుకోనున్నారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందున్నాడు. అయితే ట్రంప్ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
యూనైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి యూఏ1118 ఫ్లైట్ ఇంటర్నేషనల్ హూస్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి.
ఎన్నో విజయాల్ని దక్కించుకున్న చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ పేరును రష్యా తాజాగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో హమాస్‌కు మద్ధతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఈ నౌకలపై దాడులు చేశారు. కానీ ఈ దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నాడట. ఈ విషయం తెలియడంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా.. అధ్యయనంలో ఏం తెలిసిందో వివరాల్లో తెలుసుకుందాం.
ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రాం సర్వీసులకు మంగళవారం రాత్రి కొన్ని గంటలుపాటు అంతరాయం కలిగింది... వివరాల్లోకి వెళితే...