Ukraine Russia War Hyderabadi Died: ఏజెంట్ల మోసం ఓ హైదరాబాదీ వ్యక్తి మృతికి కారణం అయింది. ఏజెంట్లు అధిక జీతం ఆశ చూపుతూ ఇటీవల భారత్ నుంచి యువకులను తీసుకెళ్లి రష్యా ప్రైవేట్ సైన్యంలో చేర్చే ఘటనలు పెరుగుతున్నాయి. ఇలా రష్యా సైన్యంలో బలవంతంగా చేరిన హైదరాబాదీ యువకుడు(Hyderabadi Died) అఫ్సాన్(30) ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో( War) చనిపోయాడు.
ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అఫ్సాన్ కుటుంబం, తాము రష్యా అధికారులతో టచ్‌లో ఉన్నామని తెలిపింది. అతని పార్థివ దేహాన్ని స్వస్థానానికి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. అఫ్సాన్ హైదరాబాద్‌లోని నాంపల్లి, బజార్ ఘాట్‌కు చెందిన వాడు. దీంతో అతని కుటుంబం ఇక్కడ శోక సంద్రంలో మునిగిపోయింది.
ఏజెంట్లు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి దాదాపుగా 20 మందికి పైగా యువకుల్ని ఇక్కడి నుంచి రష్యాకు(
Russia) తీసుకెళ్లారు. వారిలో అఫ్సాన్ కూడా ఒకరు. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి పలువురిని ఇలా ఏజెంట్లు రష్యాకు పంపించారు. వీరిని రక్షించి తిరిగి భారత్‌కి పంపించేందుకు రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది. ఈ లోపే ఈ ఘటన జరగడం అందరినీ కలవరపరుస్తోంది. ఈ విషయంపై ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవేసీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.