»Vijay Devarakonda Hand To The Star Heroine Has The Number Also Been Blocked
Vijay Devarakonda: స్టార్ హీరోయిన్‌కు రౌడీ హ్యాండ్.. నెంబర్ కూడా బ్లాక్ చేశాడా?
ఇండస్ట్రీలో వచ్చే గాసిప్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఫలానా హీరో, హీరోయిన్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే పుకార్లు వస్తునే ఉంటాయి. అలాగే ఇంకా చాలా విషయాల్లో ఫిల్మ్ నగర్లో చెవులు కొరుక్కుంటు ఉంటారు. ఈ క్రమంలో రౌడీ హీరో ఓ స్టార్ హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేశాడని గుసగుసలాడుకుంటున్నారు.
Vijay Devarakonda hand to the star heroine.. Has the number also been blocked?
Vijay Devarakonda: లైగర్ సినిమాతో ఫ్లాప్ చూసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వెంటనే ఖుషి సినిమాతో ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఇదే జోష్‌లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ఓ స్టార్ హీరోయిన్ ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశాడనే టాక్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఆమె ఎవరో కాదు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే అని అంటున్నారు. పూజా బ్యాడ్ లక్ ఏంటో గానీ.. వచ్చిన ఆఫర్లన్నీ కూడా చేజారిపోతున్నాయి. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మధ్యలోనే తీసేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు. అలాగే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో రానున్న సినిమా ఆఫర్ కూడా పోయిందంటున్నారు. అయితే.. జనగణమనలో రొమాన్స్ చేయాల్సిన రౌడీ, పూజా.. అనుకోకుండా సినిమా ఆగిపోవడంతో ఆగిపోయారు. దీంతో ఫ్యామిలీ స్టార్‌లో ముందుగా పూజను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడట విజయ్. కానీ ఫైనల్‌గా మృణాల్ ఠాకూర్‌ను లాక్ చేశారు. ఇలా రౌడీతో వరుసగా రెండు ఛాన్స్‌లు మిస్ అయింది పూజా. దీంతో రెండుసార్లు తనకు హ్యాండ్ ఇచ్చావని.. విజయ్ దేవరకొండ పై కోపంతో రగిలిపోయింట పూజా బేబి. వరుసగా రౌడీకి మెసేజ్‌లు పంపిస్తూ ఉండేదట. దీంతో రౌడీ, పూజా నెంబర్‌ను బ్లాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఏదేమైనా.. ఇలాంటి విషయాలు ఎలా లీక్ అవుతాయో మరి!