»Krystyna Pyszkova Bhama Of Czech Republic Is Crowned Miss World 2024
Miss World 2024: మిస్ వర్డల్-2024 చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా
భారత్ అతిథ్యం ఇచ్చిన ప్రపంచ అందాల పోటీలో మిస్ వరల్డ్-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా దక్కించుకుంది. టాప్-8వ స్థానంలో భారత యువతి సినీ శెట్టి ఉంది.
Christina Bhama of Czech Republic is crowned Miss World-2024
Miss World 2024: దాదాపు 24 సంవత్సరాల తరువాత ప్రపంచ అందాల పోటీలకు ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్-2024 ఫైనల్ పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా చేజిక్కించుకుంది. మొత్తం 112 దేశాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరందరిలో అత్యంత సుందరమైన మహిళగా క్రిస్టీనా(Krystyna Pyszkova) ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తరువాత రెండవ స్థానంలో యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), మూడవ స్థానంలో ఆచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బొత్స్వానా) నాలుగువ స్థానంలో నిలిచారు. ఎంతో ఉత్కంఠబరితంగా ఈ పోటీలు సాగాయి.
ఈ అందాల పోటీల్లో భారత్కు నిరాశే మిగిలింది. సొంత గడ్డపై మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్-8 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు. అయితే సినీ శెట్టి చివరి వరకూ గట్టిపోటీనే ఇచ్చింది.