అమెరికాలోని యూనివర్సిటీలు ఇకపై తమ భారతీయ స్టడీ-ఓవర్సీస్ భాగస్వాముల ద్వారా టోఫెల్ టెస్ట్ స్కోర్లను ధృవీకరించుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ తెలిపింది.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా యుద్ధ ట్యాంకును నడిపారు. ఎప్పటికప్పుడు సైనిక సన్నద్ధతను పర్యవేక్షిస్తుంటారు.
హిందూ మహాసముద్రంలో దొంగలు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను హైజాక్ చేశారు. బొగ్గు తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయల్దేరిన నౌకను అయుధాలతో బెదిరించారు.
జపాన్ ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ విఫలం అయింది. లాంచ్ అయిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
తమ దేశ సరిహద్దుల నుంచి చొరబాట్లకు ప్రయత్నించిన 234 మంది ఉక్రెయిన్ ఫైటర్లను హతమార్చినట్లు రష్యా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం మంగళవారం కుప్పకూలింది. విమానంలో 15 మంది ఉన్నారని, ప్రమాదం కారణంగా వారందరూ మరణించారని నివేదికలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023కు గాను ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ పాక్ 14వ అధ్యక్షుడిగా రెండోసారి దేశాధినేత అధికారం చేపట్టారు. ఈక్రమంలో దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తన నోటి దురుసుదనంతో కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు డొనాల్డ్ ట్రంప్. ఈ సారి దానితోనే ఆయన ఆస్కార్ వేదిక సాక్షిగా నవ్వులపాలయ్యారు. వివరాల్లోకి వెళితే...
96వ ఆస్కార్ అవార్డ్ వేడుకలు ఈరోజు ఉదయం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల వేడుకలో జాన్ సేనాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చే అవకాశం దక్కింది. దీంతో అతను న్యూడ్‌గా స్టేజ్‌పైకి వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
డాక్యుమెంటరీల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఫీచర్ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’ నిరసను మిగిల్చింది. అవార్డును సాధించలేకపోయింది.
గాజాలో ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ లాస్ ఏంజలస్‌లో ఆందోళనకారులు నిరనలకు దిగారు. ఫలితంగా లాస్ ఏంజలస్‌లో జరుగుతున్న ఆస్కార్ వేడుకలపైనా ఆ ప్రభావం పడింది.
ఉగ్రసంస్థ అల్-ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్-బటర్ఫీ మృతిచెందారు. అయితే అతను ఏ కారణంగా చనిపోయాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. ఈ సీజన్‌లో ఓపెన్ హైమర్ చిత్రం ఎక్కువ అవార్డులను అందుకుంది.
యుఎస్ సెనేట్ రిపబ్లికన్ నాయకుడు మిచ్ మెక్‌కానెల్ కోడలు చెరువులో మునిగి మరణించింది. షిప్పింగ్ సంస్థ ఫోర్మోస్ట్ గ్రూప్ 50 ఏళ్ల సీఈవో ఏంజెలా చావో తన టెస్లా కారుతో సహా అమెరికాలోని టెక్సాస్‌లోని ఒక చెరువులో పడి మునిగి మరణించారు. ఈ సంఘటన ఫిబ్రవరి 2024లో జరిగింది.