Oscar Awards 2024 : లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎంతో హుషారుగా సాగింది. ఈ ఏడాది డాక్యుమెంటరీ విభాగంలో మన భారతీయ ఫీచర్ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’ (To Kill a Tiger)నామినేట్ అయ్యింది. అయితే ఇది ఈ సారి అవార్డును సాధించలేకపోయింది. గతేడాది ఆర్ఆర్ఆర్తో మూడు విభాగాల్లో భారత్ ఆస్కార్ అవార్డుల్ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది.
డాక్యుమెంటరీ విభాగంలో ఈ సారి అమెరికన్ హాలీవుడ్ డాక్యుమెంటరీ ‘20 డేస్ ఇన్ మారియుపోల్’ అవార్డు దక్కించుకుంది. భారతీయ డాక్యుమెంటరీ అయిన టు కిల్ ఏ టైగర్ ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలూ అందుకుంది. అందుకనే ఈ ఏడాది ఈ ఫీచర్ ఫిల్మ్‌ని ఆస్కార్ వరిస్తుందని భారతీయులు అంతా ఆతృతగా ఎదురు చూశారు. కానీ అది ఇప్పుడు నిరాశ పరిచింది. అయితే గతేడాది మన దేశం నుంచి ఇదే కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది.
అయితే 2024లో ఈ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న 20 డేస్ ఇన్ మారియుపోల్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మారియుపోల్ అనే ఓడరేవును సీజ్ చేశారు. ఆ సమయంలో ఉక్రెయిన్ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను అందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. దీంతో ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఈ ఫీచర్ ఫిల్మ్‌కి దక్కింది.