»Hyderabad International Award For Shamshabad Airport
Hyderabad: శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023కు గాను ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని జీఎంఆర్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వార్షిక అవార్డుల్లో భాగంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో 2023కు గాను ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో హైదరాబాద్ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఈ విమానాశ్రయం ద్వారా ఏడాదికి 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 400 విమానాశ్రయాలు ఈ పురస్కారం కోసం పోటీపడ్డాయి. ఈ పురస్కారం సాధించడంపై జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడారు.
విమానాశ్రయ నిర్వహణలో భాగం పంచుకున్న అందరికీ దీన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. వాళ్ల నిర్విరామ కృషి, అంకితభావం వల్లే అంతర్జాతీయ పురస్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్టు విస్తరణ ప్రణాళికలు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. టెర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్లో కొత్త సౌకర్యాలు, మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు సౌలభ్యం పెరిగేందుకు ఇవి దోహదం చేస్తాయని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా, కెనడా, లండన్‌తో పాటు అరబ్ దేశాలకు ఎక్కువమంది ప్రయాణిస్తున్నారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నవారి సంఖ్య ఏటా 20 శాతానికి పైగా పెరుగుతోంది. గతేడాది నెలకు సగటున 20 లక్షల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించారు.