»Russia Puts Kasparov On Terrorists Extremists List
Garry Kasparov : చెస్ దిగ్గజం కాస్పరోవ్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన రష్యా!
ఎన్నో విజయాల్ని దక్కించుకున్న చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ పేరును రష్యా తాజాగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
Garry Kasparov : చదరంగంలో ప్రపంచ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ పేరును రష్యా తాజాగా ఉగ్రవాదులు\అతివాదుల(terrorists & extremists) జాబితాలో చేర్చింది. దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఈ ఘటనతో రష్యాలో పుతిన్‌ని విమర్శించే వాళ్లు ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని బతకాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ప్రసిద్ధ చదరంగ క్రీడాకారుడు. అనేక సార్ల ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే ఆయన తన అభిప్రాయాలను చాలా బలంగా వినిపిస్తూ ఉంటారు. పుతిన్‌కు వ్యతిరేకంగా అనేకసార్లు విమర్శలు చేశారు. ఆయన విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఉక్రెయిన్‌పై రష్యా(
Russia) సైనిక చర్యలనూ చాలా సార్లు ఖండించారు.
ఈ నేపథ్యంలో రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ రోస్ఫిన్ మానిటరింగ్ తాజాగా విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో గ్యారీ(Garry) పేరును పొందుపరిచింది. అయితే ఎందుకు చేర్చారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తుల బ్యాంకు ఖాతాలపై ప్రభుత్వ ఆంక్షలు ఉంటాయి. వారు లావాదేవీలు జరపాల్సిన ప్రతి సారీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2014లోనే గ్యారీ రష్యా(Russia) విడిచి వెళ్లిపోయారు. దాదాపు పదేళ్లుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారు.