గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఈరోజు రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు.
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పని చేస్తున్న భారతీయుల్ని ఆ సేవల నుంచి తొలగించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
చాలా సార్లు మనం వాడే మొబైల్ నెట్వర్క్‌ల విషయంలో కనెక్టివిటీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మన బాధను పట్టించుకునే వారే ఉండరిక్కడ. కానీ అమెరికాలో పది గంటల పాటు మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీలో ఇబ్బందులు వచ్చిన కారణంగా ఓ సంస్థ వినియోగదారులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది.
అమెరికా అధ్యక్షపదవి బరిలో డొనాల్డ్ ట్రంప్, జో బైడన్ నిలిచేలా ఉన్నారని తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే అభ్యర్థిత్వ పోటీలో జోరుమీదున్న ట్రంప్ తాజాగా నిక్కీ హేలీ సొంత రాష్ట్రంలో కూడా విజయం సాధించారు.
ముంబయి నుంచి మారిషస్‌కు వెళుతున్న ఎయిర్ మారిషస్ విమానంలో సాంకేతిక లోపాల వల్ల ఏసీలు పని చేయలేదు. దీంతో దానిలో ప్రయాణిస్తున్న పిల్లలు, ఒక వృద్ధుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృతిపై రష్యన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పైనా విరుచుకుపడుతున్నారు.
కరోనా వైరస్ విలయతాండవం చేసిన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్స్ శ్రీరామ రక్షగా నిలిచాయి. అయితే అవే ఇప్పుడు మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయి అని తాజా అధ్యయనం వెల్లడించింది. ఏ వ్యాక్సిన్ వలన ఏ ప్రమాదం పొంచి ఉందో వెల్లడించారు.
మలేషియాకు చెందిన ఓ యువకుడు అక్కడి నుంచి ఏకంగా మక్కాకు సైకిల్‌పై చేరుకోవాలని సంకల్పించాడు. మార్గ మధ్యంలో భారత్ పంజాబ్‌లోని జామా మసీదును సైతం సందర్శించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మతంపై ఉన్న ప్రేమ ఎట్టకేలకు ప్రకటించుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ర్యాలీలో మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలు క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నాయని ఆరోపించారు.
స్పెయిన్‌లోని వాలెన్సియా సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో 15 మంది అదృశ్యమయ్యారు.
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో నలుగురు భారతీయులు దారుణంగా మోసపోయారు. వారిని అక్కడికి తీసుకువెళ్లి బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి తమను పంపిస్తున్నారంటూ వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారీ రవాణా నౌక చైనాలో ఓ వంతెనను ఢీకొంది. గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై ఈరోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనను నౌక బలంగా ఢీకొనడంతో రెండు ముక్కలైంది.
వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. ఈ వ్యాది సోకిన ఏ జంతువైన మరణించాల్సిందే. ఇది మానవులకు సోకే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కంటే చిన్నదైన యువతితో సన్నిహితంగా ఉంటున్నారని ఆ దేశంలోని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.