Makkah Cycle Yatra : సైకిల్‌పై యువకుడు మలేసియా టు మక్కా యాత్ర
మలేషియాకు చెందిన ఓ యువకుడు అక్కడి నుంచి ఏకంగా మక్కాకు సైకిల్‌పై చేరుకోవాలని సంకల్పించాడు. మార్గ మధ్యంలో భారత్ పంజాబ్‌లోని జామా మసీదును సైతం సందర్శించాడు.
Malaysia To Makkah by Cycle : మలేషియాకు చెందిన అప్ధరుద్దీన్ ఆ దేశం నుంచి మక్కా మసీదుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి చేరుకోవాలని సంకల్పించాడు. ఈ క్రమంలోనే అతడు మార్గ మధ్యంలో భారత్‌లోనూ ఆగాడు. పంజాబ్ రాష్ట్రంలోఉన్న జామా మసీదును దర్శించుకుని ముందుకు కదిలాడు. జామా మసీదుకు చేరుకున్న సమయంలో జామా మసీదు ఇమామ్ అప్ధరుద్దీన్కు సాదర స్వాగతం పలికాదు. ఈ సైకిల్ యాత్ర గురించి తెలుసుకున్న అక్కడి వారంతా హర్షం వ్యక్తం చేశారు.
అప్ధరుద్దీన్ మక్కా(Makkah) చేరుకున్న తర్ వాత భారత్, పంజాబ్‌ల భద్రత కోసం ప్రార్థించాలని జామా మసీదు పెద్దలు అతడిని కోరారు. అఫ్దరుద్దీన్ లూధియానాలో చేపట్టిన సైకిల్ యాత్రలో సైతం జామా మసీదు ఇమామ్ పాల్గొన్నారు.
ఈ విషయమై అఫ్దరుద్దీన్ మాట్టాడాడు. మలేషియా(Malaysia) నుంచి మక్కాకు మొత్తం 5500 కిలో మీటర్ల ప్రయాణమని చెప్పాడు. మే నెలకల్లా తాను మక్కా చేరుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై తాను సోషల్ మీడియాలో సైతం ఎలాంటి పోస్ట్‌లు చేయలేదని అన్నాడు. తాను ఇలా సైకిల్ యాత్ర చేయడం మీద తన కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పాడు. తనకు చాలా మద్దతుగా నిలుస్తున్నారని అన్నాడు. ధైర్యం ఉంటే చాలు యువత ఏ పనైనా చేయగలదన్న సందేశాన్ని తాను ఇవ్వాలని అనుకుంటున్నానని అందుకే ఈ యాత్ర ప్రారంభించానన చెప్పాడు.